News January 23, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పరిశ్రమలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సదాశివనగర్ మండలం లింగంపల్లిలో జూట్ పరిశ్రమ పనులు కొనసాగుతుండగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. కాగా తాజాగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి జరగనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News November 13, 2025

సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com

News November 13, 2025

GNT: 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులపై సమీక్ష

image

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాల గురించి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా అధ్యక్షత వహించి మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన వర్క్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్‌పర్సన్ సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

News November 13, 2025

నాగార్జున- సురేఖ కేసు.. DEC2కు విచారణ వాయిదా

image

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు మరోసారి వాయిదా పడింది. HYDలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.