News August 1, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10 మంది సబ్ రిజిస్ట్రార్ల నియామకం

image

రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమించారు. కాగా నిజామాబాద్ అర్బన్‌లో ఇద్దరు, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, బోధన్‌లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు.

Similar News

News March 13, 2025

భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

image

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.

News March 13, 2025

NZB: మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవులు

image

నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌కు వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. 14న హోలీ, 15న దల్హండి, 16న ఆదివారం కావడంతో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవన్నారు. దీనిని గమనించి రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు. 17తేదీ నుంచి యథావిధిగా మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.

News March 13, 2025

భీమ్‌గల్: రక్తం వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడు

image

బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టి గాయపరిచిన ఘటన భీమ్‌గల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి తరగతి గదిలో అల్లరి చేశాడని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. దీంతో తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని NSUI జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ డిమాండ్ చేశారు.

error: Content is protected !!