News August 24, 2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

* సిర్నాపల్లిలో అంత్యక్రియలో వెళ్లి మృతి చెందిన యువకుడు* పిట్లంలో 3 ఇసుక టిప్పర్లు పట్టివేత* బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు* ఆర్మూర్ రుణమాఫీ కోసం వేల సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులు* రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు.
Similar News
News January 7, 2026
NZB: సర్వే చేసి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక: DCC అధ్యక్షుడు

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను సర్వే చేసి ఎంపిక చేస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో వార్డుల్లో ముందుగా ప్రతి వార్డులో ముగ్గురు చొప్పున అభ్యర్థుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి సర్వే చేస్తామన్నారు. అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసి పేర్లను డీసీసీలు, టీపీసీసీకి పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుందన్నారు.
News January 7, 2026
UPDATE.. NZB: కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డికి బెయిల్

ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా, కాంగ్రెస్ బాల్కొండ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి, దాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
News January 7, 2026
NZB: సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది: CP

దివ్యాంగుల సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం నిర్వహించిన డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధిగమించే దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.


