News May 4, 2024
ఉమ్మడి పాలమూరుకు అధినేతల రాక

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా పార్టీల అగ్ర నేతల పర్యటనలు పెరుగుతున్నాయి. ఈనెల 5న AICC అగ్రనేత రాహుల్ గాంధీ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. అలాగే ప్రధాని మోదీ ఈనెల10న NRPTకు రానున్నారు. నేడు రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కొత్తకోటలో సాయంత్రం నిర్వహించనున్న కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.
Similar News
News December 11, 2025
మహబూబ్‌నగర్: పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలికొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వారికి అక్కడికక్కడే అందించేందుకు అన్ని రకాల టాబ్లెట్లను సిద్ధంగా ఉంచారు.
News December 11, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో 22.55% ఓటింగ్

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 22.55% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకోడిగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల తర్వాత ఓటర్లు రాక మొదలైంది. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను జాగ్రత్తగా కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేయిస్తున్నారు.
News December 11, 2025
సల్కర్‌పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేట 8.3 డిగ్రీలు, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 9.4, బాలానగర్ 9.5, రాజాపూర్ 9.8, భూత్పూర్ 9.9, మహమ్మదాబాద్ 10.4, కౌకుంట్ల 10.7, కోయిలకొండ మండలం పారుపల్లి, మూసాపేట మండలం జానంపేట10.8, దేవరకద్ర, మిడ్జిల్ మండలం దోనూరు 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.


