News December 14, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి ముఖ్య వార్తలు!
❤లగచర్లకు వెళ్తా..ఎవరోస్తారో చూస్తా:డీకే అరుణ
❤ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్లు
❤గద్వాల:హైవే- 44పై గడ్డి ట్రాక్టర్ దగ్దం
❤మర్రి జనార్దన్ రెడ్డికు ఈడీ నోటీసులు
❤కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:SFI
❤గ్రూప్-2..144 సెక్షన్ అమలు:SPలు
❤మధ్యాహ్న భోజనం..అధికారుల ఫోకస్
❤గండీడ్:ప్రేమను ఒప్పుకోలేదని యువకుడి సూసైడ్
❤కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు
Similar News
News December 27, 2024
NGKL: మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన సీఎం, ఎంపీ
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో రాష్ట్రానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
News December 27, 2024
MBNR: GET READY.. నేటి నుంచి ‘CM CUP-24’ పోటీలు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని DSA మైదానంలో సీఎం కప్-2024 పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,584 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. 6 మ్యాట్లపై మ్యాచులు నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ నెట్ బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి టోర్నీకి అతిథ్యం లభించింది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెల 2 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
News December 27, 2024
REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. మొదటి పర్యటనలో జులై 1 2004న ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతులకు రూ.19.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం కల్పించారు. రెండోసారి అక్టోబర్ 26 2006న కొత్తకోటలో పర్యటించి.. HYD- బెంగళూరు జాతీయ రహదారి(NH-44) విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ఆయన ఉమ్మడి పాలమూరు వాసుల మనసు గెలుచుకున్నారు.