News November 8, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి..TOP NEWS!!
✔రేపు,ఎల్లుండి ఓటర్ నమోదుకు స్పెషల్ డ్రైవ్✔ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. పలుచోట్ల అన్నదానం✔PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక✔ఆత్మకూరు: ఉద్దాల ఊరేగింపు మహోత్సవం ప్రారంభం✔GDWL: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య✔సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి: కలెక్టర్లు✔10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక.. ఏర్పాట్లపై ఫోకస్✔అవినీతిలో ఉమ్మడి పాలమూరు టాప్
Similar News
News November 13, 2024
MBNR: గ్రూప్-3 పరీక్ష సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్-3 పరీక్ష జిల్లాలో సజావుగా నిర్వహించాలని MBNR అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. MBNR, దేవరకద్రలలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.
News November 12, 2024
వెల్దండ: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వెల్దండ మండలం మహాత్మాగాంధీ తండా సమీపంలో వారం రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. రాజు అనే వ్యక్తిని అతని భార్య హిమబిందు, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు.
News November 12, 2024
MBNR: ఈనెల 15న ఉమ్మడి జిల్లా బాక్సింగ్ ఎంపికలు
MBNR జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 8-14, అండర్-17 విభాగాల బాలబాలికల బాక్సింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే వారు పాఠశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్తో ఉ.10 గంటలకు హాజరు కావాలని కోరారు.