News February 17, 2025
ఉమ్మడి పాలమూరులో బీజేపీ జెండా ఎగరాలి: డీకే అరుణ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ జెండా ఎగురవేయాలని ఎంపీ డీకే అరుణ సోమవారం అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ల వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మూసాపేట, తుంకిల్ పూర్, సంకలమద్ది గ్రామాల నుంచి 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.
Similar News
News December 10, 2025
MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

మహబూబ్నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.
News December 9, 2025
జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.


