News July 16, 2024
ఉమ్మడి పాలమూరులో మోస్తారు వర్షం
వనపర్తి జిల్లాలో సోమవారం మోస్తారు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు, అమరచింత, నారాయణపేట జిల్లాలోని నర్వలో 50మి.మీగా వర్షం పడింది. అత్యధికంగా అమరచింతలో 58.5 ఎంఎం, తక్కువగా చారకొండలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు పేటలో అత్యధికంగా 260.8MM, తక్కువగా నాగర్ కర్నూల్‌లో 199.9 ఎంఎం వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Similar News
News October 7, 2024
గద్వాల: నవజాత శిశువు మృతి.. ఆసుపత్రి వద్ద ఆందోళన
గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూరు నాగరాణికి పురిటి నొప్పులు రాగా గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం అడ్మిట్ చేశారు. కాన్పు చేసే సమయంలో నవజాత శిశువు కడుపులో మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని నాగరాణి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News October 7, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా విలియంకొండలో 34.8 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 34.5 డిగ్రీలు, గద్వాల జిల్లా రాజోలిలో 33.1 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 31.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News October 7, 2024
మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <