News October 17, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎల్లో అలెర్ట్ ⚠️

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా పంట పొలాలకు వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.

Similar News

News February 26, 2026

మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్త

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

News February 25, 2026

జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

image

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2026

పాలమూరు:టెన్త్ పరీక్షలు..13,217 మంది విద్యార్థులు

image

మహబూబ్ నగర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో రెగ్యులర్, ప్రయివేట్ విద్యార్థులు మొత్తం కలుపుకొని 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. పరీక్ష కేంద్రం పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ విధించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.