News October 17, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎల్లో అలెర్ట్ ⚠️
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా పంట పొలాలకు వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.
Similar News
News November 5, 2024
MBNR: మూడు నెలల వేతనాలు విడుదల
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు ఉన్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల జీతాలు విడుదల అయ్యాయని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఖజానాకు బిల్లులు సమర్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వీరికి నెలకు రూ.54,220 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనన్నారు.
News November 5, 2024
MBNR: కొత్త రేషన్ కార్డులు.. వచ్చేనా?
MBNR:ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
News November 5, 2024
MBNR: ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ప్రారంభమైన రాజకీయ వేడి!
సంక్రాంతి నాటికి గ్రామ పంచాయతీలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనతో గ్రామీణాల్లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంచారు. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి.