News April 29, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బరిలో ఉండేది ఎవరు…?

image

లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకు సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం నేడు వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

Similar News

News December 31, 2024

మహబూబ్ నగర్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాక

image

మహబూబ్ నగర్‌కు నేడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ వస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పై అధ్యయనం చేస్తారని తెలిపారు. ఇందుకు గాను జిల్లాలోని ఎస్సీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు MBNR కలెక్టరేట్లో హాజరై మాజీ న్యాయమూర్తికి విజ్ఞాపనలు సమర్పించి, చర్చించుకోవాలని తెలిపారు.

News December 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔కల్వకుర్తి‌:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔న్యూ ఇయర్..ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు:SPలు✔గద్వాల:13వ రోజు న్యాయవాదుల దీక్ష✔ఎస్ఎస్ఏలకు క్రమబద్ధీకరించాలి:బిఎస్పీ✔జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల యువకుడు✔NGKL:పాముకాటుతో యువ రైతు మృతి✔NRPT:PSను తనిఖీ చేసిన డిఎస్పీ✔19వ రోజు కొనసాగిన ఉద్యోగుల సమ్మె✔సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:SIలు ✔జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కోస్గి విద్యార్థి

News December 30, 2024

కల్వకుర్తి‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి యువకులు మృతి

image

కల్వకుర్తిలోని కొత్త కాటన్ మిల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై కల్వకుర్తి వైపు వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణానికి చెందిన శ్రీనాథ్ (17), భాను (16)గా గుర్తించారు. మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.