News November 2, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల జిల్లా కల్లూరు తిమ్మందొడ్డిలో 33.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 33.7, వనపర్తి జిల్లా రేవల్లి లో 32.9, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 12, 2024

MBNR: ‘ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు’

image

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు అందజేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రియబ్రతమిశ్రా చెప్పారు. MBNR SBI రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ..రైతుల కోసం రైతులే నిర్వహించుకునే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తమ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News December 12, 2024

మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త

image

అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు✔ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి✔నీటిపారుదల సమీక్ష..పాల్గొన్న ఎమ్మెల్యేలు✔పెబ్బేరు:కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు✔GDWL:TS- MESA జిల్లా సర్వసభ సమావేశం✔రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రుణాలు:DGM✔బాలానగర్:రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి✔గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్లు✔మోహన్ బాబు SORRY చెప్పాలి:ప్రెస్ క్లబ్✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్