News August 5, 2024
ఉమ్మడి పాలమూర నేటి ముఖ్యాంశాలు
@ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం.@ మహిళలకు ఉచిత బస్సు కాదు రక్షణ కావాలి: మాజీ మంత్రి.@ కృష్ణమ్మకు మంత్రి జూపల్లి పూజలు.@ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే.@ షాద్నగర్ ఘటనపై విచారణ కమిటీని వేసిన సిపి అవినాష్ మహంతి.@ ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన శ్రావణమాస వేడుకలు.@TLF నూతన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వెంకటరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.
Similar News
News September 20, 2024
MBNR: గుండెపోటుతో క్రీడాకారుడి మృతి
నవాబ్‌పెట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన మిత్రులు తెలిపారు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 20, 2024
బాధ్యులను కఠినంగా శిక్షించాలి: డీకే అరుణ
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని MBNR ఎంపీ అరుణ అన్నారు. దురదృష్టకరమైన ఘటనను హిందూ సమాజం ఖండిస్తుందని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.
News September 20, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతలివే…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా దేవరకద్రలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 36.2 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మొగలమట్కాలో 35.8 డిగ్రీలు, గద్వాల జిల్లా వెంకటాపూర్ లో 35.7 డిగ్రీలు, వనపర్తి జిల్లా పెద్దమందడిలో 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.