News March 25, 2024

ఉమ్మడి ప.గో జనసేన అభ్యర్థుల విద్యార్హతలు

image

ఉమ్మడి ప.గోలోని 15స్థానాలకు ‘కూటమి’ తరపున జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వారి విద్యార్హతలేంటో చూద్దాం.
☞ పోలవరం- చిర్రి బాలరాజు(బీఏ) (2వసారి బరిలో)
☞ నరసాపురం-బొమ్మిడి నాయకర్(డిగ్రీ) (2వ సారి బరిలో)
☞ ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు(ITI ఎలక్ట్రికల్) (తొలిసారి బరిలో)
☞ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్(బీకాం) (2వసారి బరిలో)
☞ భీమవరం- పులపర్తి రామాంజనేయులు (ఇంటర్) (4వసారి పోటీ)

Similar News

News October 22, 2025

ఈనెల 27న TPG లో కొనుగోలు కేంద్రం ప్రారంభం: జేసీ

image

ఈనెల 27న తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జేసీ రాహుల్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.

News October 21, 2025

భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

image

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జై సూర్య‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ అదాన్ నయీమ్ అస్మితో మంగళవారం మాట్లాడిన పవన్, వెంటనే డీఎస్పీపై విచారణకు ఆదేశించి, నివేదికను హోం శాఖకు, డీజీపీకి పంపించాలని ఆదేశించారు.

News October 21, 2025

పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.