News August 5, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు వర్షాలకు ఛాన్స్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలుచోట్ల సోమవారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ప.గో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT..

Similar News

News September 11, 2024

గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో వశిష్ట గోదావరి వద్ద నీటిమట్టం పెరుగుతుందని, లంక గ్రామాలు, పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతే తప్ప బోట్ల ద్వారా రాకపోకలు సాగించవద్దని హెచ్చరించారు.

News September 10, 2024

రేపు ప.గో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

ప.గో జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఆకివీడు పట్టణంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారని కూటమి నాయకులు తెలిపారు.

News September 10, 2024

ప.గో: కారును అడ్డగించి నగదు, బంగారం దోపిడీ

image

దారి కాచి 3 కాసుల బంగారం, రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై తణుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన తోట సత్తిపండు తన ముగ్గురి స్నేహితులతో కలిసి కారులో రాజమండ్రి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో డీమార్ట్ వద్ద ఇద్దరు దుండగులు సత్తిపండు కారును అడ్డగించారు. అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.