News September 11, 2024
ఉమ్మడి ప.గో. జిల్లాలో నేడు సీఎం పర్యటన ఇలా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేడు (బుధవారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు. 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా దుంపగడప గ్రామ పరిధిలో ఉన్న ఉప్పుటేరు వంతెనకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో కాకినాడ జిల్లా సామర్లకోట బయలుదేరి వెళ్తారు.
Similar News
News October 3, 2024
ప.గో.జిల్లాలో వైసీపీ కనుమరుగైంది: మేకా శేషుబాబు
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కనుమరుగవడానికి కారణం కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే గౌడలకు 10శాతం మద్యం షాపులు కేటాయించడం శుభ పరిణామన్నారు.
News October 3, 2024
పాలకోడేరు: నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ నయీం అస్మి
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జూమ్ మీట్ ద్వారా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, దర్యాప్తులపై ఆరా తీశారు. అలాగే దసరా, దీపావళికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
News October 3, 2024
ఏలూరు: నేడే టెట్ పరీక్ష నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఏలూరు జిల్లాలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో అబ్రహం సూచించారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్ణీత వేళకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిందే. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం గంట ముందుగా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.