News December 3, 2024
ఉమ్మడి ప.గో. జిల్లాలో రెండు రోజులు మద్యం బంద్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో MLC ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల సమీపంలో మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సోమవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే చట్ట రీత్యా నేరమని హెచ్చరించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Similar News
News January 14, 2025
ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు
రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.
News January 14, 2025
ఏలూరుకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 14, 2025
ప.గో: మొదటిరోజు..100 కోట్లు పైనే..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం భోగి రోజు కోడిపందాలు జోరుగా సాగాయి. పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు పాల్గొని పెద్ద ఎత్తున పందాలు కాశారు. పందాల పేరిట కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి. మొదటిరోజు కోడిపందాలు, గుండాట, పేకాటల ద్వారా సుమారు రూ.100 కోట్ల రూపాయలు పైనే చేతులు మారినట్లుగా అంచనా.