News August 31, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు భారీ వర్షాలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలను శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. అయితే.. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం ఉంటుందని తెలియజేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇవ్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News November 12, 2025

ఆకివీడు: డిప్యూటీ సీఎం చొరవతో నేడు గృహప్రవేశం

image

చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి ఇళ్లు లేక ఇబ్బంది పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ను గత మూడు నెలల క్రితం మంగళగిరిలో ఆమె పవన్‌ను కలిసి తన గోడును విన్నవించుకుంది. పవన్ ఆదేశాలతో ఇంటి నిర్మాణంలో భాగంగా, నేడు కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. సొంతింటి కల నెరవేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

News November 12, 2025

తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

image

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

News November 12, 2025

తాళ్లకోడు లేఔట్‌లో సామూహిక నూతన గృహప్రవేశాలు

image

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల లేఔట్‌లో NTR కాలనీలో సమూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. పలువురి లబ్ధిదారులకు నూతన గృహ రుణ పత్రాలు అందించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సర్పంచ్ అనురాధ ఉన్నారు.