News August 31, 2024
ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు భారీ వర్షాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలను శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. అయితే.. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం ఉంటుందని తెలియజేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇవ్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News September 19, 2024
ఏలూరు: స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. నిర్ణీత గడువులోపు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉంచామన్నారు.
News September 19, 2024
ఏలూరు: కాలువలో దిగి బాలుడు మృతి
ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్‌కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
News September 19, 2024
గుండెపోటుతో ఏలూరు సీసీఎస్ ఎస్సై మృతి
ఏలూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న డి.నరసింహారావు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఏలూరుకు చెందిన ఆయన స్థానిక సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.