News August 29, 2024
ఉమ్మడి ప.గో జిల్లాలో ‘హైడ్రా’ మాట
చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైదరాబాద్‌లో ‘హైడ్రా’ నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ‘హైడ్రా’ అవసరం మన ఉమ్మడి. ప.గో జిల్లాకు కూడా అవసరం ఉందని ఊర్లలో చర్చలు నడుస్తున్నాయి. ఇరగవరం, ఆచంట, ఆకివీడు, భీమవరం ఇలా చాలా మండలాల్లో ఆక్రమణలు చాలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఉమ్మడి జిల్లాలో 11 పంట కాలువలు, వందల బోదెలుండగా, వాటిలో చాలా వరకు ఆక్రమించేశారని ఆరోపణలు వస్తున్నాయి.
Similar News
News September 20, 2024
త్వరలో నరసాపురానికి వందే భారత్ రైలు: మంత్రి
కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడ రైల్వే డివిజన్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, భద్రతా పనులపై చర్చించామన్నారు. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్‌కు వందే భారత్ రైలును ఏర్పాటు చేసే విధంగా కార్యచరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News September 19, 2024
ప.గో: అమెరికాలో గుండెపోటుతో విద్యార్థి మృతి
నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకి చెందిన తెలుగు విద్యార్థి ముత్తిన రమేశ్ గురువారం అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో ఎంఎస్ చదివేందుకు రమేశ్ వెళ్లారు. అతని మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఇదే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎంఎస్ విద్యార్థులు మృతి చెందారు.
News September 19, 2024
ఉమ్మడి ప.గో.జిల్లాలో కూటమి పాలనపై మీ కామెంట్..!
ఉమ్మడి ప.గో.జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారం చేపట్టిన కూటమి సర్కారు పాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక, పింఛన్ పెంపు వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యేల పనితీరుపై మీ కామెంట్..