News April 16, 2025
ఉమ్మడి ప.గో. జిల్లాలో 166 పోస్టులు

విద్యాశాఖ పాఠశాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు కొత్తగా 105 SGT, SA కేడర్లలో ఉపాధ్యాయ పోస్టులను ఉమ్మడి ప.గో.జిల్లాకు మంజూరు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు మంజూరైన 61 (SET) పోస్టులతో కలిపితే మొత్తం 166 పోస్టులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 2,671 మంది ఉండగా, యూడైస్ కోడ్ ఆధారంగా పోస్టులు ఆమోదిస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు.
Similar News
News December 9, 2025
ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.
News December 9, 2025
ఆచంటలో ఈనెల 10 జాబ్ మేళా..!

ఈనెల 10న ఆచంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కంపెనీల్లో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వయసు, పదో తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.


