News April 29, 2024
ఉమ్మడి ప.గో. జిల్లాలో 24,599 మంది కొత్త ఓటర్లు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 24,599 మంది కొత్తగా ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా వారిలో మహిళలే అధికంగా ఉండడం విశేషం. మహిళలు 14,578 మంది ఉండగా.. పురుషులు 10,021 మంది. ఇక కొత్త జిల్లాల ప్రకారం చూస్తే ఏలూరు జిల్లాలో 13,014 మంది కొత్త ఓటర్లుగా నమోదు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో 11,585 మంది చేరారు.
Similar News
News April 18, 2026
ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.
News April 18, 2026
మొగల్తూరు: వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

మొగల్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని గుబ్బల మావుళ్లు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను నిత్యం వెంబడిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి, ఈనెల 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News April 18, 2026
బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


