News September 24, 2024
ఉమ్మడి ప.గో.జిల్లా నేతలకు టీడీపీలో కీలక పదవులు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు వరించాయి. ఏపీ ట్రైకార్ ఛైర్మన్‌గా పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, ఏపీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు నియమితులయ్యారు.
Similar News
News October 5, 2024
ఏలూరు: భర్తతో గొడవపడి పుట్టింటికి.. ఆపై చనిపోవాలని విజయవాడకు.!
ఏలూరు మండలం పోణంగికి చెందిన అఖిల తన భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో శుక్రవారం చనిపోవాలని 3నెలల బిడ్డతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక గంటలోనే ఆమె విజయవాడలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అక్కడ నుంచి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News October 5, 2024
ఏలూరు: రైతులకు మంత్రి విజ్ఞప్తి
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్‌మిల్లును సంప్రదించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో ఇప్పటికే 7 లక్షల గోనెసంచులు అందుబాటులో ఉంచామన్నారు.
News October 4, 2024
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.