News April 11, 2025

ఉమ్మడి ప.గో: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

image

ఉమ్మడి ప.గో.జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. దెందులూరు(M) కొమరేపల్లి హైవేపై ఇద్దరు మృతి చెందారు. గణపవరం(M) జల్లికొమ్మరలో లారీ ఢీకొన్న ఘటనలో సుబ్రహ్మణ్యం, పెనుమంట్రలో నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఒకరు, అత్తిలి(M) ఉరదాళ్లపాలెంకు చెందిన వ్యక్తి, పెంటపాడులో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు చనిపోయాడు.
NOTE: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్లండి.

Similar News

News November 4, 2025

అవసరానికి మించే యూరియా ఇచ్చాం: కేంద్రం

image

ఖరీఫ్‌లో రైతులకు కావాల్సినంత యూరియా, ఫెర్టిలైజర్స్ సరఫరా చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ(DOF) నిర్ధారించింది. 185.39 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా.. DOF 230.53లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచిందని, 193.20LMT అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే 4.08LMT అధికంగా అమ్ముడైనట్లు పేర్కొంది. పోర్టులు, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది.

News November 4, 2025

ఆదిలాబాద్: ప్రొవిజినల్ జాబితా విడుదల

image

ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో నియామకం కోసం సపోర్టు ఇంజనీరు ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జాబితాను జిల్లా కార్యాలయ నోటీసు బోర్డుతో పాటు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాలో ఏమైనా సవరణలు, మార్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఈ నెల 10 వరకు సంబంధిత సర్టిఫికెట్లతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News November 4, 2025

ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.