News April 11, 2025

ఉమ్మడి ప.గో: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

image

ఉమ్మడి ప.గో.జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. దెందులూరు(M) కొమరేపల్లి హైవేపై ఇద్దరు మృతి చెందారు. గణపవరం(M) జల్లికొమ్మరలో లారీ ఢీకొన్న ఘటనలో సుబ్రహ్మణ్యం, పెనుమంట్రలో నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఒకరు, అత్తిలి(M) ఉరదాళ్లపాలెంకు చెందిన వ్యక్తి, పెంటపాడులో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు చనిపోయాడు.
NOTE: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్లండి.

Similar News

News April 13, 2026

ఊసరవెల్లికే పోటీ.. 2 రోజుల్లో 3 పార్టీల నుంచి నామినేషన్

image

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. భరత్ సింగ్ వాఖ్లా అనే వ్యక్తి ఊసరవెల్లినే డామినేట్ చేస్తూ పార్టీల కండువాలను మార్చేశారు. దాహోద్(D) పైపెరో స్థానానికి రెండు రోజుల్లో 3 జాతీయ పార్టీల(BJP, INC, AAP) నుంచి నామినేషన్ వేశారు. ఎల్లుండితో విత్‌డ్రా గడువు ముగియనుండగా ఆయన అంతిమంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆసక్తికరం. భరత్ 2017లో కాంగ్రెస్, 2022లో ఆప్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

News April 13, 2026

తుంగభద్ర డ్యాం: మే చివరినాటికి పనులన్నీ పూర్తి

image

తుంగభద్ర జలాశయం 33 కొత్త గేట్లతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. దశాబ్దాల కాలం నాటి పాత గేట్ల స్థానంలో రూ.47 కోట్లతో ఆధునిక గేట్లను బిగిస్తున్నారు. ఇప్పటికే 26 గేట్లు బిగించి, 22 గేట్లకు ట్రయల్ రన్ పూర్తి చేశారు. వచ్చే ఖరీఫ్ నుంచి జలాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మే చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.

News April 13, 2026

ఖైరతాబాద్ మైనారిటీ గురుకులానికి 2 స్టేట్ ర్యాంకులు

image

ఇంటర్ ఫలితాల్లో ఖైరతాబాద్ మైనారిటీ గురుకుల(TMREIS) విద్యార్థులు రెండు స్టేట్ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన MD ఫర్హాన్ CEC సెకండ్ ఇయర్‌లో 988 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధిస్తే, ఇదే కళాశాలకు చెందిన హర్ష HEC ఫస్ట్ ఇయర్‌లో 492 మార్కులతో స్టేట్ 2nd ర్యాంక్ సాధించాడు. ఈ ఫలితాలు మైనారిటీ గురుకులాల పనితీరుకు నిదర్శనమని కళాశాల ప్రిన్సిపల్ హబీబ్ హర్షం వ్యక్తంచేశారు.