News September 21, 2024
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో నూతన పోలీస్ స్టేషన్లకు కసరత్తులు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జనాభా, పరిపాలన సులభతరం కావడానికి గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన జిల్లా ఎస్పీ జానకి ప్రభుత్వానికి పంపించామని శుక్రవారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో 3వ టౌన్, జడ్చర్లలో సబ్ డివిజన్ కార్యాలయం, ట్రాఫిక్ రూరల్ పోలీస్ స్టేషన్, కౌకుంట్లలో నూతన భవనాలకు నివేదికను ఇచ్చామన్నారు.
Similar News
News October 29, 2025
MBNR: నూతన ఇంజనీరింగ్ కళాశాల..100% అడ్మిషన్స్:VC

పాలమూరు వర్సిటీలోని నూతనంగా ఏర్పడ్డ ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలో ఏర్పడడం సంతోషంగా ఉందని, ఇంజినీరింగ్ కళాశాలలో 100% అడ్మిషన్స్ జరిగాయని ఉపకులపతి (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. స్నాతకోత్సవం సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. జనవరిలో నాక్ పీర్ టీం విజిట్ చేసి బి-గ్రేడ్ ఇవ్వడం జరిగిందని, గ్రంథాలయంలో కొత్త పుస్తకాలు ఏర్పాటు చేశామని, నాన్ టీచింగ్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
News October 29, 2025
పాలమూరుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాక

జిల్లా కేంద్రానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం రానున్నట్లు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం, నియామక పత్రాలు, బీసీల రిజర్వేషన్లు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధి విధానాలు, తీరుతెన్నులు తదితర విషయాలపై కార్యక్రమం ఉందన్నారు.
News October 29, 2025
MBNR: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

MBNRలోని పలుచెరువులను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
✒భారీ వర్షాల కారణంగా చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✒చేపల వేటకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు
✒చిన్నపిల్లలను, వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు
✒వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.


