News September 26, 2024
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య వార్తలు
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ✓ పెద్దకోత్తపల్లి, కొల్లాపూర్ పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఐజీ
✓మిడ్జిల్ మండలంలో పర్యటించిన ఎంపీ డేకే అరుణ
✓ గద్వాల జిల్లాలో జీవో 25కు వ్యతిరేకంగా టీచర్స్ నిరసన మెమో
✓వెల్దండలో దేవగన్నేరు కవిత పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
✓వంగూరు మండలంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది మెమో
✓పలు మండలలో ఎంఇఓలను సన్మానించిన సిబ్బంది
Similar News
News October 10, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా భద్రలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 21.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 18.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 10, 2024
గద్వాల: పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి
గద్వాల జిల్లా అయిజ మండలంలో విషాదం నెలకొంది. మేడికొండకు చెందిన బోయ లక్ష్మన్న(24) పాముకాటుతో మృతి చెందాడు. లక్ష్మన్న నిన్న పొలంలో పని చేస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన గద్వాల వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
News October 10, 2024
MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలమైన హాజ్‌కు జిల్లా నుంచి 170 మంది యాత్రికులు ఎంపికయ్యారు. యాత్రకు సంబంధించి బుధవారం బాక్స్ కాంప్లెక్స్‌లోని హాజ్ సొసైటీ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దరఖాస్తులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి హాజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి మొరాజుద్దీన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.