News October 28, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ కందుకూరు ఆర్డీవోగా, జహీరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి సంగారెడ్డి ఆర్డీవోగా, ఆర్డివో రాజు మహబూబాబాద్ ఆర్డీవోగా, గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ కొల్లాపూర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు.

Similar News

News November 13, 2024

సిద్దిపేట: చెరువు, కుంటల సంరక్షణ చర్యలు వేగవంతం చేయాలి: హెచ్ఎండీఏ కమిషనర్

image

చెరువు, కుంటల సంరక్షణ చర్యలు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలో సర్వే చేసి గుర్తించిన చెరువులు, కుంటల భూవిస్తీర్ణం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.

News November 12, 2024

హుస్నాబాద్: మంత్రిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి

image

హుస్నాబాద్‌లో ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తీర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారన్నారు. గంగర వేణి రవి, జేరిపోతుల జనార్ధన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News November 12, 2024

సిద్దిపేట: శతాబ్దాల చరిత్ర గల ఆలయం.. అభివృద్ధి చేస్తే మేలు

image

అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని గాజులపల్లి, వీరారెడ్డిపల్లి, జంగాపల్లి శివారులో దాదాపుగా వెయ్యి ఎకరాలను మించిన రాతిబండపై వెలిసిన బండ మల్లన్న ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి సంక్రాంతి రోజున ఎడ్ల బండ్లు కట్టి మల్లన్న ఆలయం చుట్టు భక్తులు ప్రదక్షిణలు చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన గుడిని ప్రభుత్వం ఆర్థిక వనరులతో అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షిస్తున్నారు.