News November 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
Similar News
News December 3, 2025
మెదక్: 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు

మెదక్ జిల్లాలో 2వ విడతలో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని 8 మండలాల్లో 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు వచ్చాయి. చేగుంట-188, మనోహరాబాద్-131, మెదక్-134, నార్సింగి-65, నిజాంపేట్-102, రామాయంపేట-126, చిన్నశంకరంపేట 185, తుప్రాన్-76 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఆలాగే 1,290 వార్డు స్థానాలకు 3,430 మంది నామినేషన్లు సమర్పించారు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
News December 3, 2025
తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.
News December 3, 2025
మెదక్: సర్పంచ్ గిరి.. అన్నదమ్ముల సవాల్

మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. గ్రామానికి చెందిన నెల్లూరు సిద్ధిరాములు, నెల్లూరి దాసు రక్తం పంచుకున్న అన్నదమ్ములు.. అది కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. సర్పంచ్ పదవిపై ఇద్దరికీ ఆశ కలిగింది. దీంతో పదవి కోసం ప్రత్యర్థులుగా మారి నిన్న జరిగిన చివరి రోజు నామినేషన్లలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.


