News November 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
Similar News
News December 10, 2024
ఐదున్నర దశాబ్దాలకు ఆత్మీయ సమ్మేళనం
పటాన్‌చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.
News December 10, 2024
డిసెంబర్ 19న ఫుల్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఫుల్‌బాల్ అసోసియేషన్ పర్యవేక్షణలో క్రీడాకారుల ఎంపికలు డిసెంబ 19న నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు.
News December 9, 2024
సిద్దిపేట: పెళ్లి కావడం లేని యువకుడి సూసైడ్ !
పెళ్లి కావట్లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నంగునూరు మండలం సిద్ధన్నపేటకు సంగు భాస్కర్(36) కారు డ్రైవర్. ఆదివారం రాత్రి డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చిన భాస్కర్.. ఉదయం చూడగా ఇంట్లో ఊరేసుకున్నాడు. పెండ్లి కావట్లేదని మనస్తాపంలో సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆసిఫ్ తెలిపారు.