News May 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఈరోజు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. రేగోడు 44.4, కొల్చారం 44.2, పోడ్చన్ పల్లి 44.1, కల్హేర్, నాగపూర్ 43.8, కట్కూరు 43.6, శివంపేట, అంగడికిష్టాపూర్ 43.4, మిన్ పూర్, ప్రగతి ధర్మారం 43.1, తుక్కాపూర్ 43.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లాకు ఆరంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News February 14, 2025
మెదక్: MLC బరిలో 71 మంది..

ఉమ్మడి MDK, KNR, NZB. ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో 71 మంది నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
News February 14, 2025
వాలంటైన్స్ డే.. మన రాజనర్సింహ లవ్ స్టోరీ

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. మంత్రి, ఆందోల్ MLA దామోదర రాజనర్సింహ, పద్మినీరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో నిజామాబాద్‌లో మిత్రుడి పెళ్లికి వెళ్లి అక్కడ పద్మినీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. స్నేహితుల సహాయంతో 1985లో ఇద్దరూ పెళ్లి చేసుకోగా ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు.
News February 14, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్‌కి గాయాలు

మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.