News August 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు

image

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో పలుచోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News November 18, 2025

మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్‌స్పెక్టర్

image

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.