News August 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు

image

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో పలుచోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News September 7, 2024

MDK: మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలలో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుందని ఐఎండి హెచ్చరించింది.

News September 7, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో శిశువు

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.

News September 7, 2024

నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.