News January 10, 2026

ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలి చంపేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ మూడు రోజులుగా మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నాయి. కోహీర్ 7.6 డిగ్రీలు, న్యాల్కర్ 7.8, మెదక్ జిల్లా దామరంచ 10.3, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్‌లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News January 17, 2026

నందిగామ Y జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

image

నందిగామ వై-జంక్షన్ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవులు ముగియడం, ఆదివారం అమావాస్య కావడంతో ప్రయాణికులు ముందుగానే HYD బాట పట్టారు. వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో పోలీసులు తాత్కాలిక ఫ్లైఓవర్ ద్వారా రాకపోకలకు అనుమతించినా ఫలితం లేకపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News January 17, 2026

సింహాచలంలో రేపు సాయంత్రం 6గంటలు వరకు మాత్రమే దర్శనం

image

సింహాచలం వరహాలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జనవరి 18వ తేదీ దర్శన వేళలో మార్పులు చేశారు. జనవరి 18న కొండ కింద గల వరాహ పుష్కరిణలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 18న ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఈవో సుజాత శనివారం తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.తెప్పోత్సవం తరువాత స్వామి వారి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

News January 17, 2026

గిరిజనుల కోసం మరిన్ని అంబులెన్సులు: కలెక్టర్

image

గిరిజన ప్రాంత ప్రజల కోసం కేజీహెచ్‌లో అంబులెన్స్‌లు ఉన్నాయని, రోగులకు మాత్రమే వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మృతదేహాలను ఇళ్లకు తరలించే విషయంలో ఇబ్బంది జరిగితే మహాప్రస్థానం వాహనాలు అందిస్తామని తెలిపారు. మరికొన్ని వాహనాలు సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేజీహెచ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.