News September 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో సబ్ జూనియర్ జట్ల ఎంపిక

image

తూప్రాన్ పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్‌లో 9న ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మహేందర్ రావు, పోచప్ప, నాగరాజు తెలిపారు. 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో 34 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే బాల బాలికల మెదక్ జిల్లా జట్ల ఎంపికలు చేపడుతున్నట్లు వివరించారు. వివరాలకు 98665 46563 సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 25, 2026

మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

image

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ. విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

News February 25, 2026

మెదక్: తొలిరోజు 99.42 శాతం

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.

News February 25, 2026

మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

image

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.