News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
Similar News
News October 25, 2025
మెదక్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు

మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా రాజశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఆర్బీ ఇన్స్పెక్టర్గా ఉన్న మధుసూదన్ గౌడ్ కామారెడ్డికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న కృష్ణమూర్తిని డీసీఆర్బీకి బదిలీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి.. అదనపు ఎస్పీ మహేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.
News October 25, 2025
మెదక్: సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణ

గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో చెందిన యువతకు 15 రోజులపాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 24, 2025
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మెదక్ కలెక్టర్

భూభారతి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించడానికి జిల్లాలో నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పది రోజుల్లో సుమారుగా వెయ్యి భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్ ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిరోజు ఒక్కో తహశీల్దార్ పది ఫైల్స్ క్లియర్ చేసి ఆర్డీవోలకు పంపించాలని తెలిపారు.


