News September 30, 2024
ఉమ్మడి మెదక్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దిశగా మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రి సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పలు సమీకరణాలపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
Similar News
News October 15, 2024
దుబ్బాక: భర్తకు తలకొరివి పెట్టిన భార్య
వారిద్దరూ అన్యోన్య దంపతులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి జీవనం సాగించారు. అయితే విధి వారి బంధాన్ని విడదీసింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేటకు చెందిన పూల శంకర్(55), రాధ భార్యాభర్తలు. సోమవారం ప్రమాదవశాత్తు శంకర్ మురికి కాలువలోపడి మృతి చెందాడు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో రాధ అంతా తానై భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. తానే భర్తకు తలకొరివి పెట్టింది. ఈఘటన బంధువులను కంటతడి పెట్టించింది.
News October 14, 2024
సంగారెడ్డి: నేడు దామోదర్ రాజనర్సింహ పర్యటన
అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News October 13, 2024
పుల్కల్: సింగూరులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి
పుల్కల్ మండలం సింగూరు నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సింగూరు గ్రామానికి చెందిన విటల్ (42) శనివారం సాయంత్రం స్నానం కోసం సింగూరు నదిలోకి వెళ్లారు. సింగూరు దిగువ భాగాన స్నానం చేస్తుండగా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.