News February 13, 2026
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కౌంటింగ్ షురూ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆమనగల్లు(బ్రిలియంట్ హై స్కూల్), చేవెళ్ల(ఫర్హా కాలేజ్), IBP(శ్రీఇందు కాలేజ్), మొయినాబాద్(మ్యాక్ ఫార్మసీ కాలేజీ), షాద్‌నగర్(మినీ స్టేడియం), శంకర్‌పల్లి(మున్సిపల్ ఆడిటోరియం), కొడంగల్(GOVT. కాలేజీ), పరిగి(నం.1 స్కూల్), VKB(SAP కాలేజ్), తాండూరు(St.MARKS), ఎల్లంపేట్(BBC), అలియాబాద్(మజీద్‌పూర్ శ్రీ చైతన్య కాలేజ్), MCపల్లి(జగ్గగూడ)లో కౌంటింగ్ జరుగుతోంది.
Similar News
News March 15, 2026
FLASH.. జమ్మికుంటలో రైలు పట్టాలపై తెగిపడిన తల

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు దూసుకెళ్లి తల, శరీరం వేర్వేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 15, 2026
16న కలెక్టరేట్‌లో PGRS

సోమవారం ఉ.10-మ.2 గంటల వరకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వొచ్చన్నారు. అర్జీల స్థితిపై 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, అర్జీలు Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
News March 15, 2026
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.


