News June 19, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు TOPNEWS

image

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
> గంజాయి పట్టివేత కేసులో ఇద్దరికీ పదేళ్ల జైలుశిక్ష
> ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసిన పాలకుర్తి MLA యశస్విని
> కన్నాయిగూడెం: జెసిబి తిరగబడి డ్రైవర్ మృతి
> ములుగులో జాబ్ మేళా నిర్వహణ
> WGL: డిసిపిలుగా బాధ్యతలు చేపట్టిన సలీమా, రాజమహేంద్ర నాయక్
> తాడ్వాయి: పురుగు మందు తాగి బాలిక సూసైడ్
> కాలేశ్వరం ఎస్సై భవాని సేన్ పై కేసు నమోదు

Similar News

News September 9, 2024

నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని: ఏసీపీ

image

గణేష్ నవరాత్రులను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పూజలు నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రాములు తదితరులు ఉన్నారు.

News September 9, 2024

సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క

image

ఆగ్రాలో జరిగిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, రాందాస్ అథవాలేతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సీతక్క మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.

News September 9, 2024

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.