News September 25, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> MLG: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: SP
> MHBD: నెల్లికుదురులో నల్లబెల్లం పట్టివేత
> WGL: నెక్కొండలో రేషన్ బియ్యం పట్టివేత
> MLG: కంతనపల్లి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: పిడుగుపాటుతో రైతు కూలీ మృతి
> MHBD: చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా
> HNK: జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
> MLG: గొల్లగుడి ఆలయ ఘటనపై కేసు నమోదు
Similar News
News October 4, 2024
వరంగల్: తగ్గిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.15వేలకి తగ్గింది. అలాగే తేజమిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా నేడు రూ.18వేల ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి రూ.15,800 ధర పలకగా నేడు రూ.15 వేలకు పడిపోయింది.
News October 4, 2024
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 4, 2024
మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.