News October 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> JN: గుండెపోటుతో హోం-గార్డు మృతి
> BHPL: సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
> MLG: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
> NSPT: పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
> JN: ఆకస్మికంగా వ్యక్తి మృతి
> HNK: అక్రమంగా గుడుంబా తరలిస్తే చర్యలు
> BHPL: పంపు బ్యాటరీ పేలి వ్యక్తికి గాయాలు
> JN: చిల్పూరులో పోలీసుల కార్దన్ సెర్చ్
> PLK: విస్నూరులో విద్యుత్ షాకుతో పాడి గేదె మృతి

Similar News

News November 5, 2024

WGL: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News November 5, 2024

మాల విరమణకు బయలుదేరిన నాగేంద్ర స్వామి మాలధారణ స్వాములు

image

గీసుకొండ మండలంలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో 41 రోజుల మండల దీక్షలు తీసుకున్న నాగేంద్ర స్వామి భక్తులు నాగుల చవితి సందర్భంగా ఈరోజు మాలవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు పాల కావడులతో ఊరేగింపుగా తిరిగి మంగళ వాయిద్యాలతో దేవాలయానికి చేరుకున్నారు. నాగేంద్ర స్వామి దేవాలయం హరోం హర అనే నినాదాలతో మార్మోగింది.

News November 5, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.16,700 ధర రాగా నేడు రూ. 16,800 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ. 14,500 ధర రాగా, ఈరోజు రూ.15వేల ధర పలికింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15 వేల ధర వచ్చిందని అధికారులు తెలిపారు.