News November 1, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైం న్యూస్..
> JN: పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
> MLG: పిడుగుపాటుకు యువకుడి మృతి
> MLG: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
> JN: గుంపులు.. గుంపులుగా కుక్కల స్వైర విహారం.. జంకుతున్న జనం
> NSPT: వైన్స్ షాపులో ఘర్షణ.. ఇద్దరికీ గాయాలు
> WGL: పోలీసు స్టేషన్లో చిరు వ్యాపారి ఆత్మహత్యయత్నం
> JN: అనారోగ్యంతో ఒకరి మృతి
Similar News
News November 2, 2024
పాలకుర్తిలో కమ్ముకున్న పొగ మంచు
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈరోజు ఉదయం పొగ మంచు కమ్మేసింది. మండలంలోని పలు గ్రామాల్లో ఓ వైపు చలి, మరోవైపు పొగ మంచు కమ్మేయడంతో అంతా చీకటిగా మారింది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు రోడ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. కాగా, పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా పొగమంచు కమ్మేయడంతో బయటకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
News November 2, 2024
వరంగల్ జిల్లాలో వర్షం.. రైతుల ఆందోళన
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా వర్షం దంచికొడుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం, చింతగూడెం, సింగారం, లక్ష్మీపురం గ్రామాల్లో గాలివాన కారణంగా వరి పంట నేల వాలింది. మిర్చి మొక్కలు నీట మునిగి, నీరు నిల్వ ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట కోసి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 2, 2024
నేడు హనుమకొండకు బీసీ కమిషన్ బృందం రాక: కలెక్టర్ ప్రావిణ్య
రాష్ట్ర బీసీ కమిషన్ బృందం రాష్ట్రవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణకు చేపట్టిన పర్యటనలో భాగంగా నేడు హనుమకొండ జిల్లాకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి దామాషా ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి వస్తున్నట్లు పేర్కొన్నారు.