News August 26, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> WGL: గుండెపోటుతో మాజీ కార్పొరేటర్ మృతి
> MHBD: కారు-బైక్ ఢీ.. నలుగురికి గాయాలు
> WGL: గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్
> JN: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి
> WGL: బ్లేడుతో గొంతు కోసుకున్న వృద్ధుడు
> WGL: ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన నిర్వహించిన ఏసీపీ
> MHBD: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

Similar News

News September 8, 2024

ఈనెల 11న కాళేశ్వరంపై ఎన్జీటీ విచారణ

image

కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రధాన బ్యారేజీలతో పాటు మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణానికి సంబంధించి చెన్నై హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈనెల 11న విచారణ చేపట్టనుంది. సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు మేరకు తొలుత ఢిల్లీ ఎన్జీటీ ధర్మాసనం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖలను ధర్మాసనం ఆదేశించింది.

News September 8, 2024

అన్నారం షరీఫ్ దర్గాలో అక్రమ వసూళ్లు!

image

అన్నారం షరీఫ్ యాకూబ్ బాబా దర్గాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందన భక్తులు మండిపడుతున్నారు. టెండర్ దారులు సొంత రశీదు టిక్కెట్లు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కందూరు చేయాలంటే రూ.2వేలకు పైగానే చెల్లించుకోవాల్సిందేనని వాపోతున్నారు. దర్గాలో భక్తుల నుంచి బలవంతంగా కానుకల పేరిట వసూలు చేస్తున్నారని, ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. మీరూ వెళ్తే కామెంట్ చేయండి.

News September 8, 2024

మేడారం అడవుల్లో విపత్తుపై ప్రభుత్వానికి నివేదిక

image

మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని నివేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని, మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కి.మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50 వేల చెట్లు కూలాయన్నారు. క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు తెలిపామని అన్నారు.