News August 14, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ జెండా ఎగరవేసేది వీరే

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా జిల్లాలో జెండా ఎగరవేసే వారిని ప్రభుత్వం ప్రకటించింది. హనుమకొండ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయజెండా ఎగురవేయనున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్, భూపాలపల్లిలో అటవీశాఖ ఛైర్మన్ పోడెం వీరయ్య, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎగరవేస్తారు.

Similar News

News September 7, 2024

ఎల్లం బజార్లో 40 ఫీట్ల భారీ మట్టి గణపతి

image

వినాయక చవితి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలకు గణనాథులను భక్తులు బాజాబజంత్రీలతో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ తరహాలో 40 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎల్లంబజార్ గణపతి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

News September 7, 2024

వరంగల్: నేరస్తులపై రౌడీషీట్లు తెరుస్తున్న పోలీసులు

image

పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వరంగల్ నగరంలో నేరాలను నియంత్రించేందుకు పోలీస్ కమిషనరేట్ పోలీసులు నేరస్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. 8 నెలల కాలంలో 36 మందిపై రౌడీ షీట్స్, 73 మందిపై సస్పెక్టెడ్ షీట్స్ తెరిచారు.

News September 6, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> BHPL: మానవత్వం చాటుకున్న ఎస్సై శ్రావణ్ కుమార్
> MLG: బొగతా జలపాతం సందర్శన షురూ
> HNK: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
> WGL: కాంస్య పతకం సాధించి రాష్ట్రానికి చేరుకున్న దీప్తి జీవాంజి
> MLG: దేశంలోనే ఇలాంటి విపత్తు చూడలేదు: ఈటల
> HNK: కాళోజీ కళాక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం: కేటీఆర్
> WGL: ‘మావో’ల ఎన్కౌంటర్‌కు టోర్నడో ఎఫెక్ట్!
> WGL: జిల్లాకు ‘వాడ్రా’ వచ్చేస్తుంది..!