News October 7, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..

image

> MHBD: దక్షిణాఫ్రికాలో మెరిసిన జిల్లా అమ్మాయి
> MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
> WGL: కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు
> JN: ఒకే ఇంటిలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు
> HNK: జిల్లాలో ఘనంగా దాండియా వేడుకలు
> BHPL: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: MLA
> HNK: వృద్ధులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి: ఎంపీ

Similar News

News November 13, 2024

వరంగల్: కోటి దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

image

వరంగల్ న్యూ శాయంపేటలోని దోణగుట్ట శ్రీ త్రివేదాద్రి సంతోష లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం కోటి దీపోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, దీప ప్రమిదను వెలిగించిన కొండా సురేఖ.

News November 12, 2024

MHBD: కారు, బైకు ఢీకొని ఇద్దరు మృతి

image

కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపెళ్లి గ్రామం వద్ద ఈరోజు రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అమర్ సింగ్ తండా వాసులుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

News November 12, 2024

వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. నిన్న పసుపు క్వింటాకి రూ.11,427 ధర రాగా నేడు రూ.11,781 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2,495 ధర పలకగా నేడు రూ.2,465 ధర పలికింది. మరోవైపు సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా ఈరోజు రూ.5,900 ధర వచ్చింది.