News July 29, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
> MLG: కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్క ఫైర్
> MHBD: పార్లమెంటులో ప్రసంగించిన ఎంపీ బలరాం నాయక్
> MLG: జల కళను సంతరించుకున్న లక్నవరం సరస్సు
> WGL: తండ్రిని పోలీసులు వేధించారని టవర్ ఎక్కిన కొడుకు
> MLG: చత్తీస్ ఘడ్-తెలంగాణా రాకపోకలు ప్రారంభం
> HNK: అనుమతి లేని జల పాతాళ వద్దకు వెళ్తే చర్యలు
> WGL: అసెంబ్లీలో ప్రసంగించిన పశ్చిమ, వర్ధన్నపేట, డోర్నకల్ ఎమ్మెల్యేలు
Similar News
News December 1, 2024
నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
News December 1, 2024
ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ
ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
News December 1, 2024
ప్రజాపాలన విజయోత్సవాల్లో WGL ఎమ్మెల్యే, HNK కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.