News July 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాత వివరాలు

image

ఉమ్మడి WGL జిల్లాలో వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. BHPLలో సాధారణ వర్షపాతం 311.7mm ఉండగా.. 307.7mm నమోదైంది. HNKలో సాధారణ వర్షపాతం 273.9mm ఉండగా.. 305.5mm రికార్డైంది. జనగామలో 232.4mm ఉండగా.. 258mm నమోదైంది. WGLలో 285.3mm సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 299mm నమోదైంది. ములుగులో 360.5mm వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. 397.5mm కురిసింది. MHBDలో సాధారణ వర్షపాతం 257mm ఉండగా.. 289.6mm నమోదైంది.

Similar News

News November 26, 2025

వరంగల్: ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి!

image

WGL జిల్లా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖలు సన్నద్ధమవాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు. కోడ్ అమలు, హోర్డింగుల తొలగింపు, నిఘా బృందాల ఏర్పాటు, మద్యం-డబ్బు పంపకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు.

News November 26, 2025

బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

image

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.