News February 12, 2026
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 78.25 శాతం పోలింగ్!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పోలింగ్ 78.25% నమోదైంది. 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మందికి 2,62,337 మంది ఓటేశారు. MHBDలో 65712 మందికి 49681, BHPL-52726కు 34421, జనగామ-44045కి 34821, NSPT-40968కి 34908, పరకాల-26784కి 21469, తొర్రూరు-21451కి 16730, స్టే.ఘ-18550కి 15670, కేసముద్రం-15963కి 13750, ములుగు-13963కి 11227, మరిపెడ-13687కి 11683, డోర్నకల్-10869కి 8900, వర్ధన్నపేట-10525కి 9077 మంది ఓటేశారు.
Similar News
News March 9, 2026
విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సోమవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 1,836 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2,111 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 9, 2026
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ మాకవరపాలెంలో పరిశ్రమలు ఏర్పాటుకు 4259 ఎకరాల భూమి సేకరణకు స్థల పరిశీలన
➤ గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష
➤ బాలుడి మృతికి నాటు తుపాకీ పేలుడే కారణం
➤ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు: ఎస్పీ
➤ పుత్తడి గైరంపేటలో గుండెపోటుతో యువకుడు మృతి
➤ శృంగవరంలో పర్యటించిన కేంద్ర బృందం
➤ ఎరకన్నపాలెం టూ పెద్దపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
➤PGRS లో ఫిర్యాదుల వెల్లువ


