News February 28, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57%

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.
Similar News
News February 28, 2025
వరంగల్: నర్సంపేటలో విషాదం.. BRS నేత మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాణాల రాంబాబు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడని స్థానికులు తెలిపారు. రాంబాబు భార్య ఇందిర 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. రాంబాబు మృతిపై స్థానికులు, పట్టణ బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు నివాళులర్పించారు.
News February 28, 2025
వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.
News February 28, 2025
వరంగల్: పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవి సురేశ్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.