News February 28, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57% పోలింగ్

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.
Similar News
News October 24, 2025
సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 24, 2025
సాస్కి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: GWMC కమిషనర్

వరంగల్ నగరంలో సాస్కి(స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) పథకం అమలులో భాగంగా పురాతన కట్టడాలు బావుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని GWMC కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. కుడా కార్యాలయంలో సాస్కి పథకంపై ఆయా విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు.
News October 24, 2025
తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్‌లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


